Natural beauty tips for face

 కళ్ళకింద నల్లని మచ్చలతో బాధిస్తున్నారా



 


 చింతపండు :కళ్ళ కింద నల్లటిమచ్చలు పోవాలంటే సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగి ఉన్న చింతపండు ఆరోగ్య పరంగానే కాకుండా చర్మ సౌందర్య సాధనంగాను ఉపయోగపడుతుంది. చింతపండు రసాన్ని ముఖానికి రాసుకొని కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడుకుంటే  చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.చింతపండు, పాలు గ్రైండ్ చేసి మెత్తగా గుజ్జు చేసుకొని ముఖానికి రాసుకోవాలి. తరువాత నీటితో కడిగితే చర్మం పై నల్లని మచ్చలతో పాటు ముడతలు పోతాయి. ఇలా వారానికి రెండు  సార్లు చేస్తే ఫలితం  ఉంటుంది.

పెదాలు ఎర్రగా కనిపించాలి అంటే:



కొన్ని కొత్తిమీర ఆకులను తీసుకొని గ్రైండ్ చేసి దాని యొక్క రసాన్ని పెదవులకు తరచు పూసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్లపెదవులు నల్లబడకుండా ఎప్పుడు ఎర్రగా దొండపండులా ఉంటాయి.

ముఖం అందంగా కనిపించాలి అంటే :


ఒక స్పూన్ మెంతులని రాత్రంతా నానబెట్టి తర్వాతి రోజు మెత్తగా రుబ్బుకోవాలి.ఈ మిశ్రమానికి తేనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. దీనితో ముఖంలో వయస్సు ముదురుతున్న ఛాయలు కనిపించవు. 

ఆకర్షించే కళ్ళు మీ సొంతం:ఆకర్షించే కళ్ళు మీ సొంతం కావాలి అంటే పాల మీగడతో కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకొంటే కళ్ళ చుట్టూ ఉండే మడతలు పోయి మరింత ఆకర్షణగా కనబడుతాయి.


గ్లాస్ నీటిలో ఉసిరి పొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్ళు కడుక్కోవాలి ఇలా చేస్తే తాజాగా మెరుస్తాయి.

అందంగా కనిపిస్తూ ఆరోగ్యంగా ఉండండి. 

Comments

Post a Comment

Popular posts from this blog

best medicine vedix oil for hair

papaya fairness cream