face tips for handsome boys
బ్యూటీ టిప్స్ మహిళలకే కాదు పురుషులకి కూడా !
ప్రస్తుత కాలంలో మహిళల్లో మాదిరే పురుషుల్లో కూడా వారి అందం పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందంగా ఉండడానికి అందంగా కనిపించడానికి వారు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.కాబట్టి అటువంటి వారికోసం తప్పకుండ కొన్ని బ్యూటీ టిప్స్ అవసరం. నేను ఇచ్చేటి వంటి బ్యూటీ సలహాలు పురుషులకు తప్పకుండా సహాయ పడతాయి.
చాలా వరకు యూక్త వయస్సులో ఉండే అబ్బాయిలకు ముఖం మీద మొటిమలు సహజంగా వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో గ్లామర్ స్కిన్ కేర్ తీసుకోవాలని కోరుకుంటారు. కాబట్టి ఒక్క మహిళలకు మాత్రమే బ్యూటీ టిప్స్ ఉన్నాయి అనుకోకుండా పురుషులకు కూడా తమ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి తగిన బ్యూటీ టిప్స్ ఉన్నాయి.
ఈ చిట్కాలు పురుషుల కోసమే
సాధారణంగా చాలా మంది మగవారి చర్మం ఆయిల్ చర్మతో జిడ్డు గా ఉంటుంది. ఎందుకంటే వీరు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి సమయంలో దుమ్ము ధూళి ముఖ రంధ్రాల్లో చేరి ముఖంలో మొటిమలు, ముడతలు ఏర్పడడానికి దారి తీస్తుంది. కనుక ముఖాన్ని శుభ్రపరిచే సమయంలో కెమికల్ ఫ్రీ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం మంచిది .
ప్రతి రోజు ఇంటికి తిరిగి రావడం మొఖాన్ని మంచి నీళ్ళతో శుభ్రపరుచుకొని క్లైన్సింగ్ అప్లై చేయడం చాలా మంచిది.
పురుషులకు ఉపయోగపడే పేస్ ఫేషియల్స్
1 అతి తక్కువ రసాయనాలు కలిగిన పేస్ వాష్ తో రోజుకి 3 సార్లు వాష్ చేసుకోవాలి.
2 సోపు ఉత్పత్తులకు సంబంధించి లేదా డియోడరెంట్స్ కు సంబంధించిన ఉత్పత్తులను మొఖానికి వాడకూడదు.
3 ముఖ్యంగా పురుషుల చర్మం రఫ్ గా ఉంటుంది. కాబట్టి అందుకోసం విటమిన్ E ప్రొడక్ట్స్ ను లేదా అలోవెరా (కలబంద ) లతో తయారైనటువంటి పేస్ వాష్ లతో శుభ్రం చేసుకోవాలి.
4 షేవింగ్ చేసిన తరువాత అలోవెరా పేస్ వాష్ చేసుకొంటే షేవింగ్ సమయంలో చిన్న గాట్లు ఏర్పడ్డా ఎటువంటి మార్క్ లేకుండా చేస్తుంది.
5 వ్యాజ్ లైన్ ను తరచూ పెదాలకు రాస్తూ ఉండాలి.
6 మొఖం మరి గరుకుగా ఉన్నప్పుడు సప్పని సరిగా బ్యూటీ పార్లర్ కి వెళ్లి సలహాలు తీసుకొని పాటించాలి.
ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే ముఖంలో మొటిమలు , ముడతలు , రంధ్రాలు పోగొట్టి ముఖ చర్మాన్ని ఆకర్షణీయంగా ఉంచుతుంది.
Comments
Post a Comment